
- గత నెలలో తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం చర్చలు
- ఈ సమావేశం అజెండాలో తొలిసారి చేరిన ఏపీ రాజధాని అమరావతి అంశం
- అమరావతి నిర్మాణానికి రూ.1,000 కోట్లు ఇవ్వాలని ఏపీ అధికారుల ప్రతిపాదన
- నిధులు ఇవ్వొద్దంటూ సీఎం లేఖ రాశారన్న కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు
- ఈ నెల 23న మరోమారు భేటీ నేపథ్యంలో వెలుగు చూసిన రాజధాని నిధుల చర్చ

ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి విడుదల కావాల్సిన విషయంలో గత నెలలో జరిగిన సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన ఓ కీలక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమరావతి నిర్మాణానికి రూ.1,000 కోట్లు ఇవ్వాలని గత సమావేశంలో కేంద్రాన్ని ఏపీ అధికారులు కోరారట. అయితే ఈ సమావేశానికి హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ఏపీ అధికారుల ప్రతిపాదనపై విస్మయం వ్యక్తం చేశారట. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులేమీ ఇవ్వవద్దంటూ ఏపీ సీఎం కార్యాలయం నుంచి లేఖ వచ్చిందని… స్వయంగా సీఎం రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వవద్దంటూ ఉంటే… అధికారులు నిధులు ఎలా అడుగుతారని ఆ శాఖ అధికారులు ప్రశ్నించారట. అంతేకాకుండా ఇప్పటికే రాజధాని నిర్మాణానికి రూ.1,500 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం ఆ సమావేశంలో వెల్లడించింది.