ఈ దీవి చాలా ప్రత్యేకం… లేడీస్ స్పెషల్!

ఫిన్ లాండ్ లో ఉన్న ఓ దీవికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ దీవి పేరే ‘సూపర్ షీ’. పేరులో ఉన్న ‘షీ’కి తగ్గట్టుగా ఇది కేవలం మహిళలకు మాత్రమే ఉద్దేశించిన ఐలాండ్. మగవాళ్లకు నో ఎంట్రీ. ఇంతజేసీ ఇది చాలా చిన్న దీవి. అంతా కలిపి 8.4 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. అసలు ఇది మహిళలకే ఎందుకు ప్రత్యేకమో తెలుసుకోవాలంటే అమెరికా మహిళా గురించి తెలుసుకోవాలి.

ఈ ‘సూపర్ షీ’ దీవికి ఆమే యజమానురాలు. స్త్రీలకు మాత్రమే ప్రత్యేకంగా ఓ రిసార్టు ఏర్పాటు చేయాలని తలంచి, కొన్నేళ్ల కిందట ఈ దీవిని అందుకు అనుగుణంగా మార్చేశారు. ఈ రిసార్టులో అన్ని సౌకర్యాలతో పాటు స్పా, సాహస క్రీడల కోసం ఏర్పాట్లు కూడా ఉన్నాయి. యోగా చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు… అందుకోసం ప్రత్యేకంగా క్లాసులు కూడా నిర్వహిస్తారు. నోరూరించే అన్ని రకాల వంటకాలు ఈ ఐలాండ్ రిసార్టులో లభ్యమవుతాయి. ఇక్కడికి వచ్చే మహిళా టూరిస్టులు స్వయంగా వంట చేసుకోవాలనుకున్నా ఇక్కడ అందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయి.

‘సూపర్ షీ’ ఐలాండ్ లోని రిసార్టులో వసతి పొందాలంటే కనీసం పది మంది ఓ గ్రూప్ గా రావాల్సి ఉంటుంది. పురుషులంటే గిట్టని వాళ్లకు ఇది స్వర్గధామం అని యజమానురాలు క్రిస్టినా రూత్ చెబుతున్నారు. పురుషాధిక్య ప్రపంచంలో మానసిక ఉల్లాసానికి నోచుకోని మహిళలు ఇక్కడ నచ్చినట్టుగా గడపవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *