22/04/2021

తిరుమలలో వాహ‌నంపై అన్య‌మ‌త స్టిక్కర్.. గుర్తించి సరి చేసిన విజిలెన్స్ అధికారులు

తిరుమల కొండపై ఈ రోజు అన్య‌మ‌త స్టిక్కర్ తో కూడిన వాహనం కాసేపు అలజడి రేపింది. తాజాగా, అన్యమత స్టిక్కర్ అంటించి ఉన్న ఓ వాహనం తిరుమలకు వచ్చింది.

రాంబగీచా పార్కింగ్ ప్రదేశంలో ఈ వాహనాన్ని ఉంచ‌గా, దానిపై ఉన్న అన్యమత బొమ్మను పెట్రోలింగ్ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు.

అనంత‌రం వెంట‌నే ఆ వాహనంపై ఉన్న ఆ స్టిక్కర్‌పై మ‌రో పేపర్‌ను అంటించారు. ఆ వాహ‌నం తమిళనాడు నుంచి వ‌చ్చింద‌ని గుర్తించిన అధికారులు దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: