మైహోమ్‌ను వరించిన మరో అవార్డ్‌ .. మైహోమ్‌ ఇండస్ట్రీస్‌కు తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్‌ బ్రాండ్ అవార్డ్‌

Spread the love

నాణ్యతా ప్రమాణాలకు మారుపేరైన మైహోమ్‌ ఇండస్ట్రీస్‌ను మరో అవార్డ్‌ వరించింది. తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ అవార్డ్‌ను .. మైహోమ్‌ ఇండస్ట్రీస్‌కు అందించింది ఎంప్లాయర్‌ బ్రాండింగ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా. వరల్డ్‌ హెచ్‌ఆర్డీ కాంగ్రెస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరుగుతున్న 17వ ఎంప్లాయర్‌ బ్రాండింగ్ అవార్డ్స్‌ కార్యక్రమంలో మైహోమ్ ఇండస్ట్రీస్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఉద్యోగుల విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.

1998లో మైహోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రారంభమయ్యింది. మైహోమ్ ఇండస్ట్రీస్‌కు మొత్తం 4 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కొత్తగా మరో 3 సిమెంట్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 10 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కూడా త్వరలోనే రెట్టింపు కానుంది. మైహోమ్ ఇండస్ట్రీస్‌.. మహా సిమెంట్ బ్రాండ్ పేరుతో సిమెంట్‌ను విక్రయిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మహా సిమెంట్ బ్రాండ్‌కు మంచి గుర్తింపు ఉంది.

ఫ్యాక్టరీల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు మైహోమ్‌ ఇండస్ట్రీస్‌కు గతంలోనే గోల్డెన్ పీకాక్ అవార్డు వరించింది. అటు ఉద్యోగుల నిర్వహణ సామర్థ్యం పెంపొందించేందుకు మేనేజ్‌మెంట్‌ నిరంతర కృషి చేస్తోంది. ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబాలకు నిరంతరం పలు సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తోంది. ఫలితంగా మైహోమ్‌ ఇండస్ట్రీస్‌లో పనిచేస్తున్న అత్యధిక శాతం ఉద్యోగులకు సంస్థతో దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఉద్యోగుల విషయంలో మైహోమ్ ఇండస్ట్రీస్‌ మేనేజ్‌మెంట్‌ చేపట్టిన చర్యలకు గుర్తింపుగా.. తెలంగాణ బెస్ట్‌ ఎంప్లాయర్ అవార్డు లభించింది.

-1998లో ప్రారంభమైన మైహోమ్‌ ఇండస్ట్రీస్‌

-మైహోమ్ ఇండస్ట్రీస్‌కు మొత్తం 4 సిమెంట్ ఫ్యాక్టరీలు

-కొత్తగా మరో 3 సిమెంట్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సన్నాహాలు

-10 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం త్వరలోనే రెట్టింపు

-మహా సిమెంట్ బ్రాండ్ పేరుతో సిమెంట్ అమ్మకాలు

-ఫ్యాక్టరీల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు మైహోమ్‌ ఇండస్ట్రీస్‌కు గతంలో గోల్డెన్ పీకాక్ అవార్డు

-ఉద్యోగుల నిర్వహణ సామర్థ్యం పెంపొందించేందుకు నిరంతర కృషి

-ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబాలకు నిరంతరం పలు సంక్షేమ కార్యక్రమాల అమలు

-అత్యధిక శాతం ఉద్యోగులకు సంస్థతో దీర్ఘకాల అనుబంధం

WP2Social Auto Publish Powered By : XYZScripts.com