మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు. బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని చెబుతున్నానని, కొద్దిసేపటి క్రితమే తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినట్లు అభిజిత్ ట్వీట్‌లో వెల్లడించారు. వైద్యులు ఆయన కోలుకోవాలని తీవ్రంగా శ్రమించారని, దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది కోరుకున్నారని.. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ ఆగస్ట్ 10న ఆస్పత్రిలో చేరారు. 1935 డిసెంబర్ 11న ప్రణబ్‌ ముఖర్జీ పశ్చిమ బెంగాల్‌లోని బిర్భుమ్ జిల్లా మిరాఠీలో జన్మించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *