మన మాతృభూమి గొప్పదనం ఇదే!: పవన్ కల్యాణ్

ఇటీవల బెంగళూరులో తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగడం తెలిసిందే. భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగింది. ఓ ఫేస్ బుక్ పోస్టు మతపరమైన విద్వేషాలకు దారితీసింది. అయితే, తాజాగా ఈ అల్లర్ల సందర్భంగా చోటుచేసుకున్న ఓ సుహృద్భావ సంఘటన వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ వైపు అల్లరిమూకలు రోడ్డుపై విధ్వంసం సృష్టించేందుకు ఉరకలు వేస్తుండగా, ముస్లింలు చేయి చేయి కలిపి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఆలయానికి రక్షణగా నిలబడడం ఆ వీడియోలో దర్శనమిచ్చింది. బెంగళూరులోని ఆ హిందూ ఆలయం చుట్టూ ముస్లింలు మానవహారంలా ఏర్పడ్డారు. దీనిపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ముస్లింల సౌహార్ద్ర చర్యను స్వాగతిస్తూ, మన మాతృభూమి గొప్పదనం ఇదేనంటూ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *