భూ క్రమబద్ధీకరణ ఆదాయంతో పట్టణాల అభివృద్ధి

భూముల క్రమబద్ధీకరణ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆయా పట్టణాల్లో అభివృద్ధి పనుల కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్​ఆర్​ఎస్​ ద్వారా వచ్చిన మొత్తంలో 70 శాతాన్ని అభివృద్ధి పనుల కోసం వినియోగించుకోవచ్చని… పురపాలక శాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు.

జీహెచ్​ఎంసీ మినహా మిగతా పట్టణాలు, నగరాలకు ఈ సౌకర్యాన్ని కల్పించారు. క్రమబద్ధీకరణ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలకమండలిలో తీర్మానాలు చేసి.. జిల్లా కలెక్టర్లకు పంపాలని తెలిపారు. కొత్త కాలనీలు, విలీన గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *