తెలంగాణలో ముగిసిన ప్రచార పర్వం!

తెలంగాణలో ముగిసిన ప్రచార పర్వం!

తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వానికి గడువు ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 11న పోలింగ్‌ జరగనుంది. ఈ సాయంత్రం 5గంటలకే ప్రచారాన్ని ముగించాలన్న ఈసీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో మైకులన్నీ మూగబోయాయి. అయితే నిజామాబాద్‌ నియోజకవర్గంలో మాత్రం ప్రచారానికి సాయంత్రం 6 గంటల వరకు సమయమిచ్చారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీల నేతలూ చెమటోడ్చారు. గురువారం 13 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా.. నిజామాబాద్‌లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల వరకు నిర్వహించనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. తెలంగాణలో మొత్తం 2,96,97,279 మంది ఓటర్లు ఉండగా.. ఎన్నికల బరిలో 443 మంది అభ్యర్థులు నిలిచారు. నిజామాబాద్ నుంచి అత్యధికంగా 185 మంది బరిలో ఉండగా.. అత్యల్పంగా మెదక్‌ నుంచి 10 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: