డబ్బు కోసం సినిమాలు తీస్తోంది నేనొక్కడ్నేనా… ఇతర ఫిలింమేకర్లు డబ్బు కోసం సినిమాలు తీయడంలేదా?: వర్మ

ఇటీవల కాలంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ కొత్త చిత్రం ప్రకటించినా ఏదో ఒక విధంగా కాంట్రవర్సీ అవుతోంది. వివాదం కారణంగా వర్మ చిత్రాలకు పబ్లిసిటీ వస్తుందని, డబ్బు కోసమే వర్మ వివాదాస్పద కథాంశాలను ఎన్నుకుంటాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై వర్మ ట్విట్టర్ లో స్పందించారు. “డబ్బు కోసమే ఈ సినిమాలు తీస్తున్నాడు అని చెబుతున్నవారందరికీ ఓ మనవి. డబ్బు కోసం సినిమాలు తీస్తోంది నేనొక్కడ్నేనా… ఇతర ఫిలింమేకర్లు అందరూ డబ్బు కోసం సినిమాలు తీయడంలేదా? వాళ్లందరూ మనుషులపై ప్రేమతో, మానవతా గుణంతో, సేవభావంతోనో, లేకపోతే పేదలకు విరాళాలు ఇచ్చేందుకు సినిమాలు తీస్తున్నారా?” అంటూ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *