వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయోధ్య భూమి పూజకు హాజరుకానున్న అద్వానీ, జోషి!

దశాబ్దాల తరబడి కోర్టుల్లో నలిగిన అయోధ్య రామజన్మభూమి అంశం పరిష్కారమవడం తెలిసిందే. సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి మార్గం సుగమం అయింది. ఈ నెల 5న అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు హాజరవుతున్నారు.

అయితే నాడు రామ మందిరం కోసం దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించిన బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు మురళీ మనోహర్ జోషి ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనడంలేదు. వీరిద్దరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయోధ్య భూమి పూజలో పాల్గొంటారని తెలుస్తోంది. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అద్వానీ, జోషిలకు ఈ మేరకు ఆహ్వానం పంపింది. ఫోన్ ద్వారా భూమి పూజ సమాచారం అందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *