భాజపాను ఎదుర్కోవడంలో కాంగ్రెస్‌ విఫలమైంది.!

భాజపాను ఎదుర్కోవడంలో కాంగ్రెస్‌ విఫలమైంది.!

 లోక్‌సభ తొలి దశ ఎన్నికల ప్రచారానికి ఈరోజే చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు తమ మాటల్లో పదును పెంచాయి. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి భారతీయ జనతా పార్టీపై, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మరోసారి ప్రధాని మోదీని ప్రధాని కానివ్వమంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడారు.
‘దేశంలో ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీద, ప్రధాని నరేంద్ర మోదీ మీద అసంతృప్తి ఉంది. ప్రతి రాష్ట్రంలోనూ వారిపై వ్యతిరేకంగా పోటీ చేయడానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ప్రధానిని గద్దె నుంచి దింపడానికి అందరూ ఏకమవుతాం.ఆయనను ప్రధాని కానివ్వం. కొత్త భారత్‌ను నిర్మిస్తాం. ఆ పార్టీకి బెంగాలీలన్నా, మన రాష్ట్రమన్నా గిట్టదు.అందుకే రాష్ట్రం పేరు మార్చడానికి కూడా వారు అనుమతి ఇవ్వలేదు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇష్టానుసారం పేర్లను మార్చేశారు. మనకు మాత్రం ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. భాజపాపై కాంగ్రెస్‌ గట్టిగా పోరాడలేకపోతోంది కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్‌ వైఫల్యమే. మనమందరం ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఆ పార్టీ ఇంకా రెచ్చిపోతుంది. ఫలితంగా మనం కూడా వాళ్లకు బానిసలుగా బతకాల్సి ఉంటుంది’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: