14/05/2021

ఎనిమిది కిలోల బ‌రువు త‌గ్గిన అల్లు అర్జున్!

‘అల వైకుంఠపురంలో’ సినిమాతో మరో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఇందులో బన్నీ సరసన రష్మిక నటిస్తుంది. కరోనా నేపథ్యంలో ఈ షూటింగ్‌ వాయిదా పడగా, వైరస్ ప్రభావం తగ్గగానే తిరిగి షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ఈ సినిమా కోసం బన్నీ కొత్త గెటప్‌లో కనపడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందులో ఆయన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసింది. స్టైలిష్ స్టార్‌ లుక్‌ అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో పుష్ప‌రాజ్‌ పాత్రలో కనపడనున్న బ‌న్నీ ఆ పాత్ర కోసం ఇప్ప‌టికే ఎనిమిది కిలోల బ‌రువు త‌గ్గార‌ట.

బరువు తగ్గడం కోసం బన్నీ ఇటీవల కేబీఆర్‌ పార్కులో తన ఇంటి వద్ద రన్నింగ్‌ చేస్తూ కనపడ్డ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ సినిమాను శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తీస్తున్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: