08/05/2021

’30 రోజుల్లో సమాధానం చెప్పాలి’.. చైనా సంస్థ ‘అలీబాబా’కు భారత్ కోర్టు సమన్లు

చైనా సంస్థ ‘అలీబాబా’ గ్రూప్‌కు చెందిన యూసీ వెబ్‌కు సంబంధించిన గురుగ్రాంలోని ఆఫీసులో 2017 అక్టోబర్‌ వరకు పార్మర్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేసిన  పుష్పేంద్ర సింగ్‌ పర్మార్‌ను ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని భారత్‌లోని కోర్టును ఆశ్రయించిన పర్మార్‌ చైనా సంస్థల తీరుపై పలు విషయాలు వెల్లడించారు.

తనను ఉద్యోగం నుంచి తొలగించినందుకు 2,68,000 డాలర్లు చెల్లించాలని కోరారు. చైనాతో పాటు ఆ దేశ‌ యాప్‌లకు వ్యతిరేకంగా ఏదైనా కంటెంట్‌ ఉంటే యూసీ బ్రౌజర్‌, యూసీ న్యూస్‌ దాన్ని తొలగించేదని ఆయన చెప్పారు. ఇవి సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలకు కారణమవుతాయన్న వంకతో వాటిని తొలగించే వారని చెప్పారు. వీటిపై తాను ప్రశ్నించినందుకు తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆయన కోర్టుకు చెప్పారు.

దీంతో 30 రోజుల్లోగా తమ స్పందనను రాతపూర్వకంగా తెలియచేయాలని ఆయన తరఫు న్యాయమూర్తి అలీబాబా కంపెనీతో పాటు సంస్థ ఎగ్జిక్యూటివ్‌లను కోరారు. కాగా, దీనిపై స్పందించిన యూసీ ఇండియా ఓ ప్రకటన చేసింది. భారత్‌లో పనిచేసే స్థానిక ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడిఉన్నామని చెప్పింది. భారత చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పింది. ఈ కేసుపై మాత్రం ఇప్పుడు స్పందించబోమని తెలిపింది.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: