కొంపముంచిన షేర్‌చాట్ పరిచయం… యువతి కిడ్నాప్, రేప్

అది కేరళ… త్రిచూర్‌. అక్కడ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది బాధితురాలు. ఖాళీ టైమ్ దొరకగానే… మొబైల్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, షేర్‌చాట్, ట్విట్టర్ ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ వాడేసేది. ఇలాంటి సమయంలో… ఆమెకు షేర్‌చాట్‌లో 26 ఏళ్ల కుర్రాడు తగిలాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదనీ… బిజినెస్ చేస్తున్నానని చెప్పాడు. ఓహో అనుకుంది. పరిచయం స్నేహంగా మారింది. స్నేహం కాస్తా… ప్రేమలా తయారైంది. చాటింగ్‌లు, గుసగుసలు ఎక్కువయ్యాయి. కాలేజీ మానేయొచ్చుగా అన్నాడు. ఎందుకూ అంటే… మానేస్తే… నాతో మాట్లాడుతూ ఉండొచ్చు… అన్నాడు. ఆశ, దోశ అంటూ… ఏదో చెప్పింది. జులై 6న బైక్‌పై ఆమె ఇంటికి వచ్చాడు. అతన్ని నమ్మి బైక్ ఎక్కింది. జాయ్ రైడ్ అని తీసుకెళ్లాడు.

కన్నంకులం తీసుకెళ్లాడు. అక్కడ చెట్లు, తుప్పలు, పొదలు, ముళ్ల మొక్కలు… ఇలా చాలా రకాలున్నాయి. నిర్మానుష్యమైన ప్రదేశంలో… ఓ ఇల్లు ఉంది. అదే తన ఇల్లు అని చెప్పాడు. ఇంట్లోకి తీసుకెళ్లి… తలుపు వేశాడు. అక్కడ ఆమెను రేప్ చేశాడు. వరుసగా ఐదు రోజులు ఆ ఇంట్లో బంధించి ఐదుసార్లు రేప్ చేశాడు. ఆమె తప్పించుకునే అవకాశం లేకుండా చేశాడు. ఆమె నుంచి మొబైల్ లాక్కొని… తగలబెట్టేశాడు.

అతను ఎంత దుర్మార్గుడో గ్రహించిన ఆమె… ఎలాగైనా అతని నుంచి బయట పడాలనుకుంది. ఈలోగా… పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ వెళ్లింది. ఆమె ఎవరో కుర్రాడి బైక్ ఎక్కి వెళ్లినట్లు అస్పష్టమైన సీసీ ఫుటేజ్ లభించింది. అతను హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎవరన్నది పోలీసులు గుర్తించలేకపోయారు. ఆ బండి నంబర్ కూడా సరిగా కనిపించలేదు.

ఆమె సిమ్ నంబర్ ఆధారంగా పోలీసులు… అది ఏ టవర్ దగ్గర ఉందో తెలుసుకున్నారు. ఆ చుట్టుపక్కల సీక్రెట్ సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఆ క్రమంలో… ఒంటరిగా ఉన్న ఇంటిని చూశారు. కిటికీలోంచీ చూడగా… ఆమె నోట్లో గుడ్డలు కుక్కి… మంచానికి చేతులూ, కాళ్లను కట్టేసి ఉంచడం చూశారు. సరైన టైమ్ కోసం ఎదురుచూశారు. మధ్యాహ్నం మీల్స్ తేవడానికి ఇంట్లోంచీ బయటకు వచ్చాడు. అంతే… అతన్ని పట్టుకొని అరెస్టు చేశారు. ఆమెను విడిపించారు. ఇలా ఈ కిడ్నాపింగ్, రేప్ దారుణానికి బ్రేక్ పడింది.

ఈ ఘటనతో పోలీసులు… యువతను హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఎవర్ని బడితే వాళ్లను నమ్మొద్దనీ… ఇష్టమొచ్చినట్లు ఎవరితో బడితే వాళ్లతో వెళ్లొద్దని చెప్పారు. మోసగాళ్లు ఎప్పుడూ ఎవర్ని ముంచుదామా అని ఎదురుచూస్తూ ఉంటారనీ… అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *