ఈ వయసులో రాఘవేంద్రరావు చేసిన పనికి ఆశ్యర్యపోతున్న నెటిజన్స్..

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్‌గా తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. బాలీవుడ్‌లో సైతం సత్తా చాటారు ఈయన. అంతేకాదు ఓ హీరోయిన్ ను తెరపై ఎంత అందంగా చూపించాలో…ఏ ఏ యాంగిల్స్ లో చూపించాలో కే.రాఘవేంద్రరావుకు తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదు. దర్శకేంద్రుడి కెమెరాకు ప్రతి భామ ఒక ముద్దబంతి పూవ్వే. పదహారేళ్ల వయసు కన్నెపిల్ల భావాలను సిరిమల్లె పువ్వల్లే చాలా చక్కగా ఆవిష్కరించడం ఆయన స్టైల్. కథానాయికను శృంగారదేవతగా చూపించడంలో సక్సెస్ సాధించాడు.ఈయన రూపొందించే మూవీల్లో కథ, కథనంతో పాటు మ్యూజిక్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. అలాగే పాటల చిత్రీకరణలో.. హీరోయిన్ ను గ్లామర్ గా చూపించడంలో దర్శకేంద్రుడి శైలి విభిన్నమైనది. అందుకనే ఆయన మూవీని కేవలం పాటల కోసం మాత్రమే చూసే ప్రేక్షకులు నేటికి ఉన్నారు.  ముఖ్యంగా హీరోయిన్స్ నాభిపై ఆయన వేసే పూలు, పండ్ల కోసం రిపీట్ ఆడియన్స్ ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి ట్రాక్ రికార్డు ఉన్న రాఘవేంద్రరావు ఇపుడు సినిమాలకు దూరంగా సీరియల్స్ చేస్తున్నాడు. తాజాగా ఈయన ఇంట్లోనే వ్యాయామాలు చేయడతో పాటు సైక్లింగ్ చేస్తున్నాడు. ఈయన సైక్లింగ్ చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 70 ఏళ్ల పై పడిన వయసులో కూడా రాఘవేంద్రరావు ఫిట్‌నెస్ చూసి అభిమానులు ఆశ్యర్యపోతున్నారు. అంతేకాదు ఓ యువకుడు తొక్కినట్టు సైకిల్ తొక్కి అందిరినీ ఆశ్యర్య చకితులను చేసాడు.

రాఘవేంద్రరావు ఇంట్లోనే లాన్‌లో సైకిల్ తొక్కిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అంతేకాదు ఈ ప్రపంచంలో మనకు అందించే వాటిలో ఉత్తమమైనవి. ప్రకృతి, ఆరోగ్యం, నమ్మదగిన స్నేహితుడు అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియోలో రాఘవేంద్రరావు సైకిల్ తొక్కుతుంటే.. ఆయన వెనకాల ఈయన పెంపుడు కుక్క కూడా ఉంది. దాన్నే ఆయన నమ్మదగిన స్నేహితుడుగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అంతేకాదు కాదు తన వీడియోలో ప్రకృతితో పాటు ఆరోగ్యం, స్నేహితుడిని ఒక వీడియోలో చూపించారు రాఘవేంద్రరావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *