కజకిస్థాన్ లో అంతుచిక్కని మరో వైరస్‌.. వందలాది మంది మృత్యువాత: చైనా ఎంబసీ ప్రకటన

తమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత పడుతున్నారని చైనా సంచలన ప్రకటన చేసింది. దీనిపట్ల ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని కజకిస్థాన్‌లోని చైనా ఎంబసీ ఆ దేశంలోని తమ ప్రజలకు సూచనలు చేసింది. దీని గురించి చైనా మీడియా వివరాలు తెలిపింది.

ఓ వైరస్‌ సోకుతుండడంతో న్యుమోనియాతో జూన్‌లో ఏకంగా 628 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ కంటే ఇది అత్యంత ప్రమాదకరమైనదని వివరించింది. ఆరు నెలల్లోనే 1,772 మంది మృతి చెందారని చెప్పింది. ఒక్క జూన్‌ నెలలోనే 628 మంది మృతి చెందారు.

కజకిస్థాన్‌లోని చైనీయులు కూడా చాలామంది ఈ వైరస్‌ బారినపడి మృతి చెందారు. ఆ కొత్త వైరస్‌ గురించి విశ్లేషించేందుకు వైద్య నిపుణులు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇప్పటికీ దాన్ని గురించిన పూర్తి వివరాలు కనిపెట్టలేకపోయారు. కజకిస్థాన్‌లో కరోనా సోకిన వారి కంటే కూడా గుర్తు తెలియని మరో కొత్త వైరస్‌ వల్ల మృతి చెందిన వారి సంఖ్య అధికంగా ఉందని చైనా మీడియా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *