విజయసాయిరెడ్డికి కౌంటర్‌ ఇస్తూ తెలుగులో ట్వీట్ చేసిన బీజేపీ జాతీయ నేత సునీల్‌ దేవధర్

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇస్తూ బీజేపీ జాతీయ నేత, పార్టీ ఏపీ కో ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవధర్‌ తెలుగులో ట్వీట్ చేశారు. తాజాగా విజయసాయి రెడ్డి బీజేపీ ఏపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ‘ఏంటి కన్నా! తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు? లేస్తే మనిషిని కాదన్నట్లు లేఖాస్త్రాలు సంధిస్తారు. టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా? బాబు అజెండాతో కమలం పువ్వును ఆంధ్రాలో కబళించే పనిలో ఉన్నప్పటికీ ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా?’ అంటూ తాజాగా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

దీనిపై ‌ సునీల్‌ దేవధర్‌ స్పందిస్తూ తెలుగులో ట్వీట్ చేశారు. ‘విజయసాయిరెడ్డి గారూ.. కేవలం పసుపు రంగునే కాదు… అన్ని రంగుల్ని కాషాయం చేయగల బలం బీజేపీకి ఉంది. ప్రస్తుతం రఘురామకృష్ణరాజు గారు ఫేడ్ చేస్తున్న మీ రంగుని మీరు కాపాడుకోండి’ అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *