గాంధీ ఆస్పత్రిలో మృతదేహాల కలకలం

గాంధీ ఆస్పత్రిలో మృతదేహాల కలకలం రేగింది. ఆస్పత్రిలోని మార్చురీకి వెళ్లే మార్గంలో గుర్తు తెలియని మృతదేహాలు నిర్లక్ష్యంగా పడేసి ఉన్నాయి. ఈ మృతదేహాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఆస్పత్రి ఉన్నతాధికారులను అడగగా వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కాగా, గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై గత కొంత కాలంగా సామాన్య ప్రజలు తీవ్ర ఆరోపణలతో కూడిన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *