07/05/2021

నేడు కూడా.. పెట్రోలుపై 25 పైసలు, డీజిల్‌పై 21 పైసలు పెరుగుదల

దేశంలో పెట్రోలు ధరల పెరుగుదలకు కళ్లెం పడడం లేదు. ఈ నెల 7 ప్రారంభమైన పెట్రోలు బాదుడు కొనసాగుతోంది. వరుసగా 21వ రోజు కూడా ధరలు పెరిగాయి. నేడు లీటరు పెట్రోలుపై 25 పైసలు పెరగ్గా, డీజిల్‌పై 21 పైసలు పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 80.38కు చేరుకోగా, డీజిల్ ధర రూ.80.40కు పెరిగింది. తాజా పెంపుతో గత మూడు వారాల్లో డీజిల్‌పై 10.27 రూపాయలు, పెట్రోలుపై 9.18 రూపాయలు చొప్పున పెరిగాయి. జూన్ 1న  రూ.71 ఉన్న లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.80.38కు చేరడం గమనార్హం.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: