17/04/2021

మరోసారి పోలీసులకు అండగా అక్షయ్​ కుమార్

పోలీసుల పట్ల మరోసారి మంచిమనసు చాటుకున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. కరోనా వైరస్​ లక్షణాలను పసిగట్టే 500 మోచేతి బ్యాండ్లను, పంజాబ్​లోని జలం​ధర్​ పోలీస్​ బృందానికి విరాళంగా ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితి, శరీర ఉష్ణోగ్రతలను కూడా ఈ పరికరం తెలియజేస్తుంది. ఇటీవల ముంబయి పోలీసులకు ఇలాంటివే 1000 బ్యాండ్లను అందించారు.

దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి అక్షయ్ తన వంతు ఆర్థిక సాయం చేయడం సహా వైరస్​పై పోరాటం చేస్తున్న యోధులకు అండగా నిలుస్తూనే ఉన్నారు. వారికి భారీ మొత్తంలో విరాళాలు, కనీస సౌకర్యాలు అందించడం చేస్తూనే ఉన్నారు.

ఇప్పటికే ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 25కోట్లు , ముంబయి మున్సిపల్ కార్పోరేషన్​లకు రూ.3 కోట్ల విరాళాలిచ్చారు అక్షయ్ కుమార్.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: