07/05/2021

‘కొడుకును కోల్పోయినట్లు అనిపిస్తోంది’

బాలీవుడ్​ నటుడు సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​​ మృతిపై దర్శకుడు అభిషేక్​ కపూర్​ ఆవేదన వ్యక్తం చేశారు. అతడు​ వజ్రంలాంటివాడని, ఓ కుమారుడ్ని కోల్పోయినట్లు అనిపిస్తోందని చెప్పారు. ‘కై.పో.చే’ సినిమాతో సుశాంత్​ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే. ఇటీవలే ఓ వెబ్​ షోలో మాట్లాడుతూ ఆ నటుడితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

View this post on Instagram

” class=”align-text-top noRightClick twitterSection” data=”

View this post on Instagram

A post shared by Abhishek kapoor (@gattukapoor) on

” style=”box-sizing: border-box; margin: 0px; padding: 0px; border: 0px; font-style: inherit; font-variant: inherit; font-weight: inherit; font-stretch: inherit; font-size: 17px; line-height: 24px; font-family: inherit; vertical-align: baseline; color: rgb(34, 34, 34);”>

View this post on Instagram

A post shared by Abhishek kapoor (@gattukapoor) on 

“సుశాంత్ నువ్వు ఇప్పటికే ఓ స్టార్​వి.. ఇతరులు నిన్ను మళ్లీ గుర్తించాలని అవసరం లేదు అని అతడికి చెబుతుండేవాడిని. కానీ ప్రస్తుతం జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం”

అభిషేక్​ కపూర్​, దర్శకుడు

సుశాంత్​కు తాను చివరగా పంపిన ఓ సందేశాన్ని చదివి వినిపించారు అభిషేక్. అయితే, దానికి అతడి ​నుంచి ఎటువంటి సమాధానం రాలేదని పేర్కొన్నారు.

” class=”align-text-top noRightClick twitterSection” data=

View this post on Instagram

A post shared by Abhishek kapoor (@gattukapoor) on

” style=”box-sizing: border-box; margin: 0px; padding: 0px; border: 0px; font-style: inherit; font-variant: inherit; font-weight: inherit; font-stretch: inherit; font-size: 17px; line-height: 24px; font-family: inherit; vertical-align: baseline; color: rgb(34, 34, 34);”>

View this post on Instagram

A post shared by Abhishek kapoor (@gattukapoor) on 

“బ్రో.. నీకోసం చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. నాకు తెలుసు నువ్వు కొంచెం బిజీగా, బాధలో ఉన్నావని.. వీలున్నప్పుడు ఫోన్ చెయి. మనిద్దరం మరో అద్భుతమైన సినిమా చేద్దాం అని అతడికి సందేశం పంపించాను. అప్పుడు సుశాంత్​ సరైన స్థితిలో లేడని నాకు అనిపించింది. కొన్నిసార్లు మాట్లాడాలనిపించింది. కానీ అతడు ఒక్కసారి ఫోన్​ చేసుంటే ఈ విధంగా జరగకుండా ఆపి ఉండేవాడిని ఏమో”

అభిషేక్​ కపూర్​, దర్శకుడు

బాలీవుడ్​లో ఎదుటి వారిని కించపరచొద్దని కొందరు వ్యక్తులకు అభిషేక్ సూచించారు. “ఇండస్ట్రీలో కళాకారులను ఓ వస్తువులా చూసే సంస్కృతి ఉంది. అటువంటి స్వభావం మనిషిని దూరం చేస్తుంది. అప్పుడు ఆర్టిస్ట్ భావోద్వేగాన్ని తెలుసుకోలేరు. వాళ్లతో కోట్ల రూపాయల సినిమా చేస్తున్నప్పుడు వారిని నిర్మాతలు ప్రత్యేకంగా చూసుకోవాలి. కనీసం మానసికంగా బాగుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి” అని ఈ సందర్భంగా చెప్పారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: