17/04/2021

ఓటీటీ ద్వారా యాక్షన్ హీరో సినిమా విడుదల

ఇప్పుడు ఓటీటీ అన్నది కొంతమంది నిర్మాతలను ఆపదలో ఆదుకుంటోంది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా.. వంటి ఓటీటీ సంస్థలు భారీ మొత్తంలో ఆఫర్ చేస్తూ పలువురు నిర్మాతలను ఆకర్షిస్తున్నాయి. మరీ ముఖ్యంగా, ఇప్పుడు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో థియేటర్లు బంద్ కావడంతో కొందరు తమ సినిమాలను వీటికి ఇచ్చేస్తూ ఆన్ లైన్ ద్వారా విడుదల చేసేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రం కూడా త్వరలో ఓటీటీ ద్వారా విడుదల కానుందని తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఈ చిత్రం రూపొంది మూడేళ్లయింది. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రం విడుదల ఫైనాన్షియల్ సమస్యల వల్ల రెండు మూడు సార్లు వాయిదా పడి.. ప్రాజక్టు స్టేల్ అయిపోయింది. ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ నుంచి మంచి ఆఫర్ రావడంతో నిర్మాతలు కమిట్ అవుతున్నట్టు సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్ తో కూడిన వివరాలను ప్రకటిస్తారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: