టాలీవుడ్ స్టార్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఏం మాట్లాడినా… అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఓ కుక్క అరవడంపై ఆయన చేసిన పలు వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారింది. అసలు కుక్క అరవడంపై బాలకృష్ణ ఎందుకు స్పందించారో తెలియదు కానీ… తాము అరిచేవాళ్లం కాదని… కరిచేవాళ్లమని ఆయన తన పక్కన ఉన్నవారితో అంటూ ముందుకు సాగారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కేవలం కుక్క అరవడంపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా ? లేక మరేదైనా ఉద్దేశ్యంతో ఇలా అన్నారా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ హాల్‌కు వచ్చిన బాలకృష్ణ… తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ తరపున అందరికంటే ముందు బాలకృష్ణే తన ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. అనంతరం బయటకు వెళుతూ కుక్క అరవడంపై బాలయ్య ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు.
మనం కరిచే వాళ్లం.. కుక్క అరవడంపై బాలకృష్ణ..

More Stories
ప్రముఖ తమిళ సినీ హాస్యనటుడు వివేక్ కన్నుమూత.. శోకసంద్రంలో కోలీవుడ్
చరణ్ జోడీగా రష్మికను సెట్ చేసిన శంకర్?
‘ఆచార్య’ అనుకున్న డేట్లో ‘లవ్ స్టోరీ’?