
- టీడీపీ అధినేతతో లోకేశ్, బ్రాహ్మణి, భువనేశ్వరి ములాఖత్
- రాజమండ్రి కేంద్రకారాగారానికి భారీగా తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు
- అదనపు భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఉన్న రాజమండ్రి కేంద్రకారాగారం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెంచారు. ఈ జైలు వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలి వచ్చారు. దీంతో పోలీసులు అదనపు భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి కేంద్రకారాగారంలో దాదాపు నెల రోజులుగా ఉన్నారు. ఈ రోజు ములాఖత్ కోసం నారా లోకేశ్, నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి రాజమండ్రికి చేరుకున్నారు. వారు కాసేపట్లో చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు.