17/04/2021

సుశాంత్ ఫ్యామిలీని పరామర్శించిన మాజీ ప్రేయసి..

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్ వర్గాలను నిర్ఘాంత పోయేలా చేసింది. 34 సంవత్సరాల వయసున్న ఈయన బాంద్రాలోని తన ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నాడు. ఈయన మరణవార్త తెలుసుకున్న అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇక సుశాంత్ ఆత్మహత్య వెనక బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజమే కారణమని చాలా మంది చెబుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొలా స్పందిస్తున్నారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుశాంత్ సినిమాల్లోకి రాకముందు 2009లో ప్రసారమైన ’పవిత్ర రిశ్తా’ సీరియల్‌తో ఫేమసయ్యాడు. ఈ సీరియల్ చేస్తోన్న సమయంలోనే సుశాంత్ .. తన తోటి నటి అంకిత లోకండేతో ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్లపాటు వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో.. వీళ్లిద్దరు తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటికే సుశాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతేకాదు సుశాంత్ వేరే నటితో డేటింగ్‌లో ఉన్నాడని .. అదే సమయంలో అంకిత వేరే అతనితో నిశ్చితార్దం చేసుకుందనే ప్రచారం కూడా జరిగింది. సుశాంత్ మరణంతో అంకిత కూడా ఎంతో కృంగిపోయినట్టు ఆమెను చూస్తే తెలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్యపై ఎలాంటి ట్వీట్ చేయని ఈమె తాజాగా ముంబైలో సుశాంత్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను వెళ్లి పరామర్శించి వారిని ఓదార్చింది. ఇక అంకిత సుశాంత్ చివరి చూపులు చూడాలనుకున్నా.. కరోనా గైడ్ లైన్స్ కారణంగా చూడలేకపోయింది.
Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: