17/04/2021

మనం ఎవరూ పర్ఫెక్ట్ కాదు.. ఇప్పటికైనా మారుదాం: అనుష్క

ఇకనుంచైనా మంచిగా బతికేందుకు ప్రయత్నిద్దామని హీరోయిన్ అనుష్క చెప్పింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె భావోద్యేగపూరిత పోస్ట్ పెట్టింది. ఇక్కడ ఎవరూ పర్ఫెక్ట్ కాదని ఆమె తెలిపింది. మనలో ఎవరూ ఒక రోడ్ మ్యాప్ తో పుట్టలేదని… ఇది మంచి మార్గం, అది చెడు మార్గం అని లేవని చెప్పింది. ప్రతి ఒక్కరికీ చిన్నవో, పెద్దవో బాధలు ఉంటాయని తెలిపింది. బాధల్లో కొందరు సాయం కోసం ఏడుస్తారని… మరికొందరు ఎవరికీ చెప్పుకోలేక లోపలే కుమిలిపోతారని చెప్పింది.

అందరం ఇకనైనా జాలి, దయతో జీవిద్దామని అనుష్క తెలిపింది. నిస్సహాయుల మాటలు విందామని, వారిని ప్రేమిద్దామని చెప్పింది. అందరం కలిసి ఉత్తమంగా జీవించేందుకు ప్రయత్నిద్దామని పిలుపునిచ్చింది. ఒక చిన్న ప్రయత్నం మనలో ఎంతో మార్పును తీసుకొస్తుందని చెప్పింది. ఎలాంటి మార్పు అయినా నెమ్మదిగానే మొదలవుతుందని తెలిపింది.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: