
- దుబాయ్ లో సైమా అవార్డుల వేడుకల
- ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న తారక్
- తన అభిమానులే తనకు సర్వస్వం అన్న యంగ్ టైగర్

దుబాయ్ లో సైమా అవార్డుల వేడుకలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి అక్కడకు వెళ్లారు. నిన్న రాత్రి జరిగిన వేడుకల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను తారక్ ఉత్తమ నటుడి అవార్డును అండుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ఒడిదుడుకుల్లో, నేను క్రిందపడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నా కనుల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా భాద పడినందుకు, నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు, నా అభిమాన సొదరులందరికి తల వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను’ అని చెప్పాడు.