
- డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలతో ఆపరేషన్ ఉధృతం
- గాయాలతో ప్రాణాలు విడిచిన మరో జవాన్
- ఈ ఆపరేషన్ లో ఇప్పటికే మొత్తం నలుగురు జవాన్ల మృతి

జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఆర్మీ, ఓ పోలీసు అధికారిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. అనంతనాగ్ జిల్లాలో మంగళవారం రాత్రి మొదలైన జాయింట్ ఆపరేషన్ ఇప్పటికీ తెరిపిన పడలేదు. ఈ ఎన్ కౌంటర్ లో తొలుత ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు,., ఒకరు కనిపించకుండా పోయారు. గాయాలతో ఒక జవాను శుక్రవారం మరణించాడు.
శుక్రవారం భద్రతా బలగాలు తమ దాడిని మరింత తీవ్రతరం చేశాయి. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు బాంబుల చప్పుళ్లతో దద్దరిల్లిపోతున్నాయి. మరోవైపు మరణించిన కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధ్యాంచెక్ మృతదేహాలను శుక్రవారం ఉదయం పానిపట్ కు తరలించారు. డీఎస్పీ హుమయూన్ భట్ కు బుద్గాంలో తుది క్రియలు నిర్వహించారు. ఉగ్రవాదుల చేతుల్లో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా జమ్మూ పట్టణంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.