22/04/2021

కరోనాకు ఎమర్జెన్సీ మెడిసిన్ అదే.. ఆమోదించిన భారత్

ప్రస్తుతానికి కరోనాకు మOదు లేదు. రాకుండా అడ్డుకునే వాక్సిన్ కూడా లేదు. రెండింటి కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఐతే అమెరికా ఔషద కంపెనీ జిలీడ్ సైన్సెస్ తయారు చేసిన యాంటీ వైరల్ డ్రగ్ రెమడిసివిర్‌తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ మందును కరోనా రోగులపై అత్యవసర సమయంలో ప్రయోగించేందుకు ఇప్పటికే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. అటు జపాన్ కూడా దీన్ని ఎమర్జెన్సీ డ్రగ్‌గా వినియోగిస్తోంది. ఈ క్రమంలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సైతం రెమడిసివిర్‌ను కరోనా ఎమర్జెన్సీ డ్రగ్‌గా అప్రూవ్ చేసింది.

‘జూన్ 1 నుంచి కోవిడ్ రోగులపై ఎమర్జెన్సీ మెడిసిన్‌గా రెమడిసివిర్‌ను ప్రయోగించేందుకు ఆమోదించాం. రోజుకు 1 డోస్ చొప్పున 5 డోస్‌లు మాత్రమే ఇచ్చేందుకు అనుమతి ఇచ్చాం.’ అని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. కాగా, రెమిడిసివిర్ డ్రగ్‌ను అమెరికాకు చెందిన జిలీడ్ సైన్సెస్ తయారుచేస్తోంది. రెమిడిసివర్‌ డ్రగ్‌పై ఈ సంస్థకు మాత్రమే పేటెంట్ హక్కులున్నాయి. ఐతే ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసి.. మార్కెటింగ్ చేసేందుకు పలు సంస్థలతో జిలీడ్ సైన్సెస్ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో భారత్‌లో సిప్లా, జుబిలెంట్ లైఫ్ సెన్సెస్, హెటిరో సంస్థలతోనూ నాన్ లైసెన్స్‌డ్ అగ్రీమెంట్ చేసుకుంది.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: