లాక్‌డౌన్ తర్వాత మీ జీవితం ఎలా ఉంటుంది? న్యూస్ 18 పోల్‌లో పాల్గొనండి..

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని తలకిందులు చేసింది. అందరి జీవితాలను మార్చివేసింది. లాక్‌డౌన్ వల్ల ప్రజల జీవన విధానంలో ఎన్నో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మాస్క్‌లు లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడికి వెళ్లినా వెంట శానిటైజర్ తీసుకొని వెళ్లాల్సి వస్తోంది. భౌతిక దూరం పాటించనిదే ఏ పనీ జరగడం లేదు. అంతేకాదు ఎవరితో మాట్లాడాలన్నా.. ఎవరినైనా కలవాలన్నా.. భయమే..! మరి లాక్‌డౌన్ తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతోంది. ఇప్పటిలాగే అందరూ జాగ్రత్తలు తీసుకుంటారా? రైళ్లు, బస్సుల్లో కరోనా భయం లేకుండానే ప్రయాణిస్తారా? ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారా? ఫ్రెండ్స్‌కు షేక్ హ్యాండ్స్, హగ్స్ ఇస్తారా? ఇప్పటిలాగే పేదలకు దాన ధర్మాలు చేస్తారా? దీనికి సంబంధించి న్యూస్ 18 పోల్ నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సర్వే మే 28తో ముగుస్తుంది.