మాస్క్‌లు, శానిటైజర్ల ధరలు ఇవేనన్న కేంద్రం… ఎక్కువ వసూలు చేస్తే చెప్పండి…

 కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలంతా ఇప్పుడు మాస్క్‌లు, శానిటైజర్ల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రజల భయాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరలకు శానిటైజర్లు, మాస్క్‌లు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ మాస్క్‌లు, శానిటైజర్ల ధరలను ఖరారు చేసింది. మాస్క్‌ల ధరలు రూ.8, రూ.10గా కేంద్రం నిర్ణయించింది. మరోవైపు.. 200 ML శానిటైజర్ ధర రూ.100గా ఖరారు చేసింది. ఈ ఆదేశాలు మార్చి 21 నుంచి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని కేంద్రం ప్రకటించింది. ప్రజల భయాన్ని క్యాష్ చేసుకుంటూ, మాస్క్‌లు, శానిటైజర్లను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు రిటైల్‌ దుకాణాలు, ఆన్‌లైన్‌ సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.