2019లో పుణె పోలీసులు సెక్స్ వర్కర్లున్న ఓ ఫ్లాట్‌లో రైడింగ్ చేశారు. ఆ రైడింగ్‌లో కొంత మంది సెక్స్ వర్కర్లు బుక్కయ్యారు. ఓ కీలక సెక్స్ వర్కర్ మాత్రం తప్పించుకుంది. ఐతే… ఆమెకు సంబంధించిన మొబైల్ పోలీసులకు దొరికింది. దాన్లో చూడగా… ఫరస్కానా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ హనుమంత మహదేవ్కి సంబంధించిన అశ్లీల ఫొటోలున్నాయి. అవి తనవి కాదంటూ… వంకరగా మాట్లాడాడు. దర్యాప్తు జరిగింది. ఆ ఫొటోల్లో ఉన్నది అతనేనని తేలింది. దాంతో… అతన్ని విధుల నుంచీ సస్పెండ్ చేశారు. ఐతే… అప్పుడు పారిపోయిన సెక్స్ వర్కర్ ఎక్కడున్నదీ ఇప్పటివరకూ తెలియలేదు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు రెండు అనుమానాలు ఉన్నాయి.
తన గుట్టు బయటపెట్టిందన్న ఉద్దేశంతో… ఆ సెక్స్ వర్కర్ని ఈ కానిస్టేబుల్ చంపేసి… డెడ్ బాడీ ఎవరికీ దొరకకుండా చేసి ఉంటాడా అన్నది మొదటి అనుమానం అయితే… తనకున్న పోలీస్ తెలివితేటలతో… ఆ సెక్స్ వర్కర్ పోలీసులకు చిక్కకుండా… ఈ కానిస్టేబులే ఆమెను తప్పించి ఉంటాడా అన్నది రెండో అనుమానం. పుణె పోలీసులు మాత్రం తమ పరువు తీసాడని కానిస్టేబుల్‌పై గుర్రుగా ఉన్నారు.
2019 డిసెంబర్ 30న పోలీసులు రైడింగ్ చేసినప్పుడు… 23 ఏళ్ల బంగ్లాదేశీ యువతి చిక్కింది. తనకేమీ తెలియదనీ… సినిమా ఇండస్ట్రీలో ఉద్యోగం ఇప్పిస్తానని బంగ్లాదేశ్ నుంచీ తీసుకొచ్చి ఇందులో దింపారని ఆమె పోలీసులకు ఏడుస్తూ చెప్పింది. ఆమెతో పాటూ మరో యువతి కూడా పోలీసులకు చిక్కింది. ఆమె స్థానిక యువతి. డబ్బు కోసమే తాను ఈ బిజినెస్‌లో దిగానని చెప్పింది. ఇక ఫ్లాట్ ఓనర్… కూడా ఇంటి అద్దెల కంటే ఈ రకంగా డబ్బు బాగా వస్తుందనే ఉద్దేశంతో… ఈ బిజినెస్‌లో పార్ట్నర్ అయ్యానని చెప్పింది. ఐతే… ఈ బిజినెస్ చేయిస్తున్న మహిళ మాత్రం పోలీసులు వస్తున్నారని తెలియగానే… ఫ్లాట్‌కి ఉన్న మరో రూట్ ద్వారా పారిపోయింది. ఆమె అలా పారిపోవడానికి కారణం… ఆ కానిస్టేబుల్ ఇచ్చిన ముందస్తు సమాచారమే అని తర్వాత దర్యాప్తులో తెలిసింది.
పారిపోయిన మహిళతో శృంగార కార్యకలాపాలు సాగించాడు కానిస్టేబుల్. వాటిని ఆమె సెల్ఫీలు తీసుకుంది. ఐతే… దర్యాప్తులో మరో విషయం తెలిసింది. ఆ పారిపోయిన సెక్స్ వర్కర్‌తో ఈ రాకెట్ మొత్తం నడిపిస్తున్నది ఈ కానిస్టేబులే అని అర్థమైంది. అతనే యువతుల్ని ఇందులో దింపి… సెక్స్ వర్కర్‌ను ప్రేరేపించినట్లు తేలింది. అలా ఓ పోలీసే… ఇదంతా చేయిస్తున్నాడని తెలిసి… ఆశ్చర్యపోవడం పుణె పోలీసుల వంతైంది.
More Stories
కరోనా టెస్టులు వద్దంటూ వందలాది మంది ప్రయాణికుల పరుగో పరుగు.. వీడియో ఇదిగో
100 మార్కులకు 125 వరకు మార్కులు వేసిన వైనం!
మహమ్మారి సమయంలో ఆపద్బాంధవుడిగా నిలిచిన సోనూసూద్ కు కరోనా పాజిటివ్!