ఒక్క పాటకు 60 లక్షలు డిమాండ్ చేస్తోన్న ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్..

నిధి అగర్వాల్.. ‘మున్నామైఖెల్‌’తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది నిధి. ‘సవ్యసాచి’తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం కంటే ముందు నిధి అగ‌ర్వాల్ చాలా చిత్రాల‌లో న‌టించిన‌ప్ప‌టికీ, ఈ సినిమాకి వ‌చ్చినంత పేరు మ‌రే చిత్రానికి రాలేదు. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత నిధికి మంచి ఆఫ‌ర్స్ కూడా వ‌స్తున్నాయి. అందులో భాగంగా భూమి అనే సినిమాతో త‌మిళ‌ చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం కాబోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో జ‌యం ర‌వి హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇటు ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు స్పెష‌ల్ సాంగ్ ఆఫ‌ర్స్ కూడా వ‌స్తున్నాయ‌ట‌. ఇటీవ‌ల ఓ నిర్మాత ఐటెం సాంగ్ విష‌యంలో నిధిని సంప్ర‌దించ‌గా, ఆమె 60 ల‌క్ష‌లు డిమాండ్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా తెలుగులో భామ అశోక్ గ‌ల్లా స‌ర‌స‌న హీరోయిన్ న‌టిస్తుంది. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు.