17/04/2021

కేసీఆర్ సూచనకే ప్రధాని మోదీ ఓకే.. హైదరాబాద్‌లోనూ కరోనా ధృవీకరణ ల్యాబ్

ప్రస్తుతం దేశంలో కరోనావైరస్ ధృవీకరణకు పుణెలోని వైరాలజీ ల్యాబ్ ఒక్కటే అందుబాటులో ఉంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిపిన టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలితే.. ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపుతుంటారు. ఐతే అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికే నమూనాలు వెళ్తుండడంతో పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే కేంద్రం పరిధిలోని CCMB ( సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయలాజీ)ని కరోనా నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించాలని శుక్రవారం నాటి వీడియో కాన్ఫరెన్స్‌లో విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని.. తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు హబ్సిగూడలో ఉన్న సీసీఎంసీ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఇంకా కేంద్రం నుంచి అధికారిక ఆదేశాలు రావాల్సి ఉందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ కుమార్ మిశ్రా న్యూస్ 18తో చెప్పారు. ఆదివారం లోగా ఆదేశాలు వచ్చే అవకాశముందని వెల్లడించారు.ఇక ఇప్పటివరకు తెలంగాణలో ప్రస్తుతంం ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించే వీలుంది. గాంధీలో చేసిన టెస్టుల్లో కరోనా పాజిటీవ్ అని తేలితే సదరు రిపోర్టును కేంద్రం పరిధిలోని పూణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్ధారించాల్సి ఉంటుంది. ఐతే సీసీఎంబీలోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్న నేపథ్యంలోనే.. ఈ ఆసుపత్రుల్లో చేసే పరీక్షలను సీసీఎంబీనే నిర్ధారించే వీలుంటుంది. పూణె వరకు పంపించాల్సిన అవసరం ఉండదు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: