14/05/2021

స్పెయిన్ నుంచి వచ్చిన మహిళ ఎంత పనిచేసిందంటే..

కరోనా వైరస్ వ్యాప్తితో తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో స్పెయిన్ ఒకటన్న విషయం తెలిసిందే. ఉన్నత చదువుల కోసం స్పెయిన్ వెళ్లిన ఓ యువతి(20) బుధవారం తన సొంత ప్రాంతమైన కోల్‌కత్తాలోని సిలిగురికి వచ్చింది. స్పెయిన్ నుంచి వచ్చిన నేపథ్యంలో సదరు యువతిని ఇంటి నిర్భంధంలోనే ఉండాలని వైద్యులు సూచించారు. కానీ ఆమె వాటిని లెక్క చేయకుండా తన పెంపుడు కుక్కను తీసుకుని సిలిగురి ప్రాంతమంతా వాకింగ్ చేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడి స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.

వెంటనే స్థానికులతో పాటు అక్కడి కౌన్సిలర్ ఘోష్ సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ వింగ్ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో కౌన్సిలర్ ఘోష్‌తో పాటు పలువురు వైద్యులు సదరు యువతి ఇంటికి వెళ్లి ఇంటి నిర్భంధంలోనే ఉండాలని చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు వారితో అస్యభంగా ప్రవర్తించినట్టు స్థానిక కౌన్సిలర్ తెలిపాడు. దీంతో యువతి, ఆమె కుటుంబ సభ్యులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలావుంటే.. ఉత్తర బెంగాల్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ కౌశిక్ సమద్దర్ మాట్లాడుతూ 35 మంది దగ్గు, జలుబు లక్షణాలతో వచ్చారని, వారిలో 20 మందిని ఇంటి నిర్భంధంలోనే ఉండాలని సూచించినట్టు తెలిపారు. మిగిలిన వారికి కరోనా వైరస్ లక్షణాలేవి లేవని చెప్పారు. ఇటీవల విదేశాల నుంచి కోల్‌కతాకు తిరిగొచ్చిన ఇద్దరు మహిళలు ఇంటి నిర్భంధం పాటించకుండా అపార్ట్‌మెంట్ సమీపంలో తిరుగుతుండగా పోలీసులు వారిని శుక్రవారం ఆస్పత్రికి తరలించారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: