కరోనా వైరస్ బారిన పడ్డ వారిని గుర్తించడం కత్తిమీద సాములా మారింది. ఇన్ని రోజులు కేవలం జ్వరం, జలుబు ఉన్నవారిని మాత్రమే కరోనా వ్యాధిగ్రస్తులుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం మరి కొన్ని లక్షణాలు కూడా దానికి తోడు అయ్యాయి. జర్మన్ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కరోనా బారిన పడిన వారిలో వాసన, రుచి సామర్థ్యం బలహీనపడుతుందని సూచిస్తున్నారు. అంతేకాదు 66 శాతం మంది రోగులలో ఈ లక్షణాలు కనిపించాయి. అలాగే విరేచనాలు కరోనా వ్యాధికున్న మరో లక్షణంగా తెలుస్తోంది. కరోనా రోగులలో 30 శాతం మందిలో ఈ లక్షణం కూడా కనిపించిందని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన చాలా మంది రోగులకు మొదట జ్వరం వస్తుందని, ఇంతేకాకుండా, అలసట, కండరాల నొప్పులు, పొడి దగ్గు తదితర లక్షణాలు కనిపిస్తాయి. అదే సమయంలో కొంతమందికి ఒకటి లేదా రెండు రోజుల పాటు వాంతులు లేదా విరేచనాలు అవుతాయి.
జ్వరం మాత్రమే కాదు…ఈ లక్షణాలు ఉన్న కరోనా వచ్చే చాన్స్…జర్మన్ వైద్యుల సంచలన పరిశోధన

More Stories
మాజీ సీఎం కుమారస్వామికి కరోనా పాజిటివ్
కరోనాతో సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మృతి
కర్ణాటక సీఎం యడియూరప్పకు కరోనా