17/04/2021

రామ్ చరణ్ చెప్పాడు.. జూనియర్ ఎన్టీఆర్ పాటిస్తున్నాడు..

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మంచి స్నేహితులు అయిపోయారు. ఇదివరకు కూడా వీళ్ళిద్దరికి సాన్నిహిత్యం బాగానే ఉంది. పైగా ఇప్పుడు RRR సినిమా చేస్తున్నారు కదా.. ఆ స్నేహం మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకుంటున్నారు. చాలా విషయాలపై చర్చించుకుంటున్నారు కూడా. ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ చరణ్ ఇచ్చిన ఓ నిఐడియా జూయర్‌కు బాగా నచ్చేసిందని తెలుస్తుంది. నందమూరి చిన్నోడు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే 20 ఏళ్లు కావొస్తుంది. ఇన్నేళ్లలో నటన తప్ప మరో లోకమే లేకుండా బతుకుతున్నాడు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR Ram Charan)

ఆ మధ్య కొన్ని రోజులు రాజకీయాలు అంటూ వెళ్లినా కూడా వెంటనే మళ్లీ సినిమాల్లోకి వచ్చేసాడు జూనియర్. ఇప్పుడు రామ్ చరణ్ చెప్పిన ఓ ప్లాన్ ఫాలో అవుతున్నాడు యంగ్ టైగర్. అదే సొంత నిర్మాణ సంస్థ. టాలీవుడ్‌లో ఇప్పుడు ప్రతీ హీరోకు సొంత ప్రొడక్షన్ హౌజ్ ఉంది. మహేష్ బాబు, బాలయ్య లాంటి హీరోలు కూడా నిర్మాణంలోకి వచ్చేసారు. నాగార్జున, వెంకటేష్ ఎప్పట్నుంచో ఉన్నారు. బన్నీ త్వరలోనే మొదలు పెట్టాలని చూస్తున్నాడు. నాగ శౌర్య, సందీప్ కిషన్ లాంటి చిన్న హీరోలు కూడా తమకంటూ ప్రత్యేకంగా సొంతంగా నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు.

 

జూనియర్ ఎన్టీఆర్ (Source: Twitter)

ఇదే దారిలో నువ్వు కూడా ఓ ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టాలంటూ రామ్ చరణ్ స్వయంగా ఎన్టీఆర్‌కు సూచించినట్లు తెలుస్తుంది. చరణ్ కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మొదలుపెట్టి తండ్రితో వరస సినిమాలు నిర్మిస్తున్నాడు. సొంత ప్రొడక్షన్ హౌజ్ ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని.. లాభాలు కూడా భారీగానే వస్తాయని ఎన్టీఆర్‌కు చరణ్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఎన్టీఆర్ కూడా ఇదే విషయంపై ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. తండ్రి హరికృష్ణ పేరు కలిసొచ్చేలా ఓ ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టాలని చూస్తున్నాడు. దీనికి NHK (నందమూరి హరికృష్ణ బ్యానర్) కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ (ntr harikrishna)

RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరుతో 14 ఏళ్ల కిందే ఓ ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు.. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఈయన చేయబోయే సినిమాకు తన బ్యానర్ స్లీపింగ్ పార్ట్‌నర్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు జూనియర్. దీనికి ఇప్పటికే అన్నయ్య ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాతగా ఉన్నారు.. అయినా కూడా తను కూడా భాగస్వామి కావాలని చూస్తున్నాడు జూనియర్. మొత్తానికి స్నేహితుడికి తనవంతు సాయం ఇలా చేస్తున్నాడు రామ్ చరణ్.
Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: