
అమరావతి : తూర్పుగోదావరి జిల్లా లో ఓ పశువైద్యుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లాలోని చింతూరులో వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రవితేజ పెద్దాపురం వరహాలయ్యపేట శివారు కాలనీలో నివాసముంటున్న విశ్రాంత ఉద్యోగికి డీడీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడు. దీంతో విశ్రాంత ఉద్యోగి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వ్యూహం ప్రకారం బాధితుడు ఏడీఏకు రూ.10 వేలు ఇస్తుండగా అక్కడే కాపు కాసిన అధికారులు రెడ్హ్యండెడ్కు పట్టుకుని కేసు నమోదు చేశారు.