‘దయా’గా జేడీ చక్రవర్తి .. హాట్ స్టార్ ట్రాక్ పైకి వస్తున్న వెబ్ సిరీస్!

Spread the love
  • ‘దయా’గా కనిపించనున్న జేడీ
  • దర్శకత్వం వహించిన పవన్ సాధినేని
  • కీలకమైన పాత్రను పోషించిన ఈషా రెబ్బా
  • ఈ నెల 4 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

జేడీ చక్రవర్తి తన కెరియర్లో ఫస్టు వెబ్ సిరీస్ గా ‘దయా’ చేశాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. పవన్ సాధినేని ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. ఈ నెల 4వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దాంతో అందుకు సంబంధించిన ప్రమోషన్స్ జోరందుకున్నాయి.

ఈ వెబ్ సిరీస్ లో జేడీ కాస్త వినికిడి లోపం గల పాత్రలో .. ఒక వ్యాన్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఒక రోజున అతని వ్యాన్ లో అతనికి తెలియకుండా ఎవరో ఒక శవాన్ని పడేసి వెళ్లిపోతారు. ఆ శవాన్ని చూసి కంగారు పడిపోయిన దయా, ఎవరికీ తెలియకుండా దానిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే అదే అతను చేసిన పొరపాటు అవుతుంది.

ఆ శవం ఎవరిది? ఆ కేసులో దయా ఎలా చిక్కున్నాడు? అందులో నుంచి బయటపడటానికి ఆయన ఏం చేశాడు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది. జేడీ చక్రవర్తి భార్య పాత్రలో ఈషా రెబ్బా నటించగా, రమ్య నంబీసన్ .. కమల్ కామరాజు .. జోష్ రవి .. యాంకర్ విష్ణుప్రియ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com