పవర్ స్టార్‌కు సీఎం పదవి రాబోతోందా?
1 min read

ఇందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన పార్టీలు పొత్తులతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. దీంతో జనసేన పార్టీల శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అటు బీజేపీ వర్గాల్లోనూ కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఆ పార్టీ కూడా కొంతలో కొంత ఉత్సాహంగానే ఉంది. బీజేపీతో జనసేనాని చేతులు కలిపిన తరుణంలో ఆయనే కాబోయే ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అంటూ జనసేన భావిస్తోంది. రాష్ట్రంలో బలం పుంజుకునే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది.
ఏపీలో బీహార్ తరహా ఫార్ములా అనుసరించాలని బీజేపీ పెద్దల యోచనగా ఉందని తెలుస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ కల్యాణ్ పేరును ప్రతిపాదించే అవకాశం ఉందటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీహార్‌లో ఎన్డీఏ తరపున నితీష్ కుమార్‌ను సీఎంగా ప్రకటించి జేడీయూతో పొత్తు పెట్టుకుని ఆ రాష్ట్రంలో బీజేపీ రాజకీయం చేస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతానికి టీడీపీ, వైసీపీలు బలంగా ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. జనసేన మరో బలమైన ప్రత్యామ్నాయంగా బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు ప్రస్తుతం బీజేపీతో చేతులు కలపడం కలిసివస్తుందని జనసేన భావిస్తోంది.