
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి గాడ్ ఫాదర్. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ వీడియోలో అదిరిపోయే స్టైల్‌తో కనిపిస్తున్నాడు చిరు. తాజాగా అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు మోహన్ రాజా. స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవాతో కలిసి పనిచేస్తున్న విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేశాడు మోహన్ రాజా.
గాడ్ ఫాదర్లో ఓ పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి పాట షూటింగ్ మొదలైంది. లొకేషన్లో ప్రభుదేవాతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ…ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు. తొలిసారి లెజెండరీ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పనిచేస్తున్నా..గాడ్ ఫాదర్ సెట్స్‌లో..అంటూ ట్వీట్ చేశాడు.
మరోవైపు షేకింగ్ లెగ్ విత్ భాయ్ (సల్మాన్) అంటూ సాంగ్ షూట్లో తీసిన స్టిల్‌ను చిరు ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ఇపుడీ ట్వీట్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ , సునీల్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.చిరు 153వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.