
The Minister of State for Commerce and Industry, Shri Jyotiraditya Scindia addressing the first meeting of the India Colombia Business Forum, in Bogota, Columbia on July 06, 2012.
బీజేపీ హయాంలోనే తెలంగాణకు అధిక నిధులు అందాయన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా . ఇక్కడ వున్నది తిరోగమన ప్రభుత్వమని.. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి ఆరోపించారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. తెలంగాణలో వున్నది తిరోగమన ప్రభుత్వమని.. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణలో అవినీతి తీవ్ర స్థాయిలో వుందని.. తప్పు చేసినవాళ్లే ఈడీ, సీబీఐలకు భయపడతారని దుయ్యబట్టారు. తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐలంటే భయం ఎందుకని జ్యోతిరాదిత్య ప్రశ్నించారు. బీజేపీ హయాంలోనే తెలంగాణకు అధిక నిధులు అందాయని ఆయన గుర్తుచేశారు.
మరోవైపు… తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అడుగులు వేస్తోంది. మేధావులు, విద్యావంతులను పార్టీలోకి చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి టి. కృష్ణ ప్రసాద్ బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తుండటమే దీనికి నిదర్శనం. తెలంగాణకు చెందిన ఆయన 1987- బ్యాచ్ IPS ఆఫీసర్. ఆయన 2020 సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేశారు. వాస్తవానికి కృష్ణ ప్రసాద్ నేడు (జూలై 29న) బీజేపీలో చేరాల్సి ఉంది. కానీ ఆగస్టు 2వ తేదీన పార్టీలో చేరుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు పలు వ్యాపార సంస్థలలో కీలక స్థానాల్లో ఉన్న గ్రూప్ కూడా పార్టీలో చేరాలని భావిస్తోందని తెలుస్తోంది.
రాజకీయ నేతలనే కాకుండా అన్ని వర్గాల్లో పేరున్న వారిని పార్టీలోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. మాజీ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న కృష్ణ ప్రసాద్.. పేదలకు సహాయం చేసే సామాజిక సేవా సంస్థను నడుపుతూ దానికి అనుబంధంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్లను బీజేపీ తన వైపునకు తిప్పుకుంది. ఎక్సైజ్ శాఖ కమిషననర్ గా ఉద్యోగ విరమణ చేసిన ఆర్ చంద్ర వదన్, కర్ణాటక మాజీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఏపీలో పనిచేసిన తెలుగు అధికారి రత్న ప్రభ చాలా కాలం క్రితం పార్టీలో చేరారు. హైదరాబాద్ లో బీజేపీలో చేరిన ఆమె తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సా ర్సీపీ అభ్యర్థిపై పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా పార్టీలో చేరారు. ఈ మాజీ బ్యూరోక్రాట్లతో పాటు ఉద్యో గుల సంఘం నాయకుడు, తెలంగాణ శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ ను, అలాగే ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు అశ్వత్థామ రెడ్డిని తన వైపునకు ఆకర్షించింది.