బియ్యం ఎగుమతులపై భారత్ ఆంక్షల ఫలితం.. అమెరికాలో వ్యాపారుల కీలక నిర్ణయం

Spread the love
  • బియ్యం కోసం దుకాణాల ముందు క్యూలు కడుతున్న భారతీయులు
  • ఒక కుటుంబానికి ఒకే బస్తా ఇవ్వాలని వ్యాపారుల నిర్ణయం
  • అయినా కరిగిపోతున్న నిల్వలు
  • ఆసియా దేశస్థుల్లో ఆందోళన

బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో అమెరికాలో బియ్యం కోసం భారతీయులు సహా ఆసియా దేశాలకు చెందినవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క బస్తా అయినా దొరికితే అదే పదివేలని భావిస్తున్నారు. భారత ప్రభుత్వం ఆంక్షలు విధించిన వెంటనే అక్కడి జనాలు సూపర్ మార్కెట్లలో బియ్యం కోసం ఎగబడ్డారు. దొరికినన్ని చేజిక్కించుకునేందుకు నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దుకాణాల ముందు కిలోమీటర్ల పొడవున క్యూలు కనిపించాయి. ఈ నేపథ్యంలో అక్కడి వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరికీ బియ్యం దక్కేలా ఒక కుటుంబానికి ఒక్కటే బస్తా విధానాన్ని అమలు చేస్తున్నారు. అయినప్పటికీ నిల్వలు నిండుకుంటుండడంతో అక్కడి ఆసియా దేశస్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com