ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలికల మిస్సింగ్ వివరాలు వెల్లడించిన కేంద్రం

Spread the love
  • 2010 నుండి 2021 వరకు 22,278 మంది మహిళలు మిస్సింగ్
  • ఈ పదేళ్ల కాలంలో 7028 మంది బాలికలు మిస్సింగ్
  • తెలంగాణలోను మిస్సింగ్ వివరాలు వెల్లడించిన కేంద్రం
Centre on Missing woman and girsl cases in AP and Telangana

తెలుగు రాష్ట్రాలలో మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర హోంశాఖ బుధవారం వెల్లడించింది. 2010 నుండి 2021 వరకు నమోదైన మిస్సింగ్ వివరాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో 2010 నుండి 2021 వరకు 7028 మంది బాలికలు, 22,278 మహిళలు మిస్సింగ్ అయినట్లు వెల్లడించింది. అలాగే, తెలంగాణలో 8066 మంది బాలికలు, 34,495 మంది మహిళలు మిస్సింగ్ అయినట్లు తెలిపింది.

మరోవైపు, రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ అడిగిన మరో ప్రశ్నకు కేంద్రం జవాబు ఇచ్చింది. తూర్పు కాపులు,శిష్ఠకరణాలు, కళింగ వైశ్యులు, సోండీలకు ఓబీసీ హోదా కల్పించడంపై జీవీఎల్ ప్రశ్న వేశారు. ఈ కులాలను ఓబీసీలో చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎలాంటి సిఫార్సు రాలేదని కేంద్రం స్పష్టం చేసింది.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com