డిస్ప్లేల నుంచి వచ్చే బ్లూలైట్ తో త్వరగా వృద్ధాప్య లక్షణాలు!

Spread the love

ఎల్ఈడీ లైట్లు, టీవీలు, కంప్యూటర్, ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ల డిస్ప్లేల నుంచి వచ్చే నీలి రంగు కాంతి వల్ల ఇప్పటివరకు తెలిసిన దానికన్నా ఎక్కువే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాటితో కేవలం కళ్లకు హాని కలగడం మాత్రమే కాకుండా.. మన శరీరంలో ఇతర జీవ గడియారాన్ని, ఇతర జీవక్రియలనూ ప్రభావితం చేస్తున్నట్టు తాజాగా గుర్తించారు. ఎల్ఈడీ లైట్ల నుంచి వెలువడే నీలి రంగు కాంతి వల్ల వృద్ధాప్య లక్షణాలు త్వరగా వస్తున్నట్టు తేలిందని వెల్లడించారు.
డిస్ప్లేల నుంచి వెలువడే నీలి రంగు కాంతితో మనపై పడే ప్రభావం ఏమిటన్న దానిపై అమెరికాకు చెందిన ఓరేగాన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధన చేశారు.  ఇందుకోసం మనుషుల జీవ క్రియలతో పోలి ఉండే ‘డ్రోసోఫిలా మెలనోగాస్టర్’ రకం ఈగలను ఎంచుకుని ప్రయోగం చేశారు.రెండు రోజుల వయసు, 20, 40, 60 రోజుల వయసున్న ఈగలను తీసుకుని బ్యాచ్ లుగా విభజించారు. వాటిని మొదట పూర్తిగా చీకట్లో ఉంచి.. ఆ తర్వాత నీలి రంగు ఎల్ఈడీ కాంతిలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వాటి శరీరాల్లో జరిగిన మార్పులను పరిశీలించారు. సాధారణంగా శరీరంలో కొన్ని రకాల కణాలు కాంతికి ప్రతిస్పందిస్తుంటాయి. కానీ నీలి రంగు కాంతి కారణంగా అలా ప్రతిస్పందించని.. అంతర్గత అవయవాల కణాలపైనా ఆ కాంతి ప్రభావం పడినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

 సాధారణ కాంతితో అంతా సాధారణంగా..
సూర్యరశ్మి నుంచి వచ్చే సహజ కాంతి మన శరీరంలో అన్ని జీవ క్రియలు సరిగా పనిచేయడానికి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 24 గంటల పాటు కొనసాగే సర్కాడియన్ రిథమ్ (జీవ గడియారం) దీనితోనే నడుస్తుందని వివరిస్తున్నారు. సహజ కాంతికి భిన్నంగా ఉండే వేర్వేరు కాంతులు, విద్యుద్దీపాల కారణంగా జీవగడియారంపై ప్రభావం పడి.. శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి, మెదడు పనితీరు, కణాల పునరుత్పత్తి వంటివి దెబ్బతింటున్నాయని తమ పరిశోధనలో తేలిందని వివరిస్తున్నారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com