Perfumes : పెర్ ఫ్యూమ్స్ ఎక్కువగా వాడుతున్నారా! అయితే జాగ్రత్త?

Spread the love

Perfumes : పెర్ ఫ్యూమ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. పార్టీ, పనిపై బయటకు వెళ్ళే సందర్భంలో, పాఠశాలకు వెళ్ళే పిల్లలు, రాత్రి సమయంలో కొందరు తప్పనిసరిగా పెర్ఫ్యూమ్స్ వాడుతుంటారు. పెర్ ఫ్యూమ్స్ వల్ల మనసు ఆహ్లాదంగా ఉంటుంది. దాని నుండి వచ్చే సువాసన మంచి భావనను కలిగిస్తుంది. పెర్ ఫ్యూమ్ ఆత్మవిశ్వాసాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. కొందరికి గాఢంగా వాసన ఉండే పెర్ ఫ్యూమ్స్ అంటే ఇష్టం ఉంటుంది. అయితే గాఢత ఎక్కువగా ఉంటే ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. మరికొందరికి లైట్ గా ఉండే వాటిని ఇష్టపడతారు. వాటిని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి.పెర్ ఫ్యూమ్స్ చుట్టు పక్కల వారికి మంచి సువాసనలు కలిగించినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ వాసనలు వారిని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. దీని గాఢత వల్ల తుమ్ములు రావటం, తలనొప్పి వంటి సమస్యలను చవిచూడాల్సి వస్తుంది. దీంతో కొంత అసహనానికి లోనవుతారు.పెర్ ఫ్యూమ్స్ చుట్టు పక్కల వారికి మంచి సువాసనలు కలిగించినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ వాసనలు వారిని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. దీని గాఢత వల్ల తుమ్ములు రావటం, తలనొప్పి వంటి సమస్యలను చవిచూడాల్సి వస్తుంది. దీంతో కొంత అసహనానికి లోనవుతారు. ఈ గాఢత కలిగిన పెర్ ఫ్యూమ్స్ వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫెర్ ఫ్యూమ్స్ లో ఇథనాల్ ఉంటుంది. ఇది పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పెర్ఫ్యూమ్ ను ఎక్కువగా వాడవద్దు. పెర్ఫ్యూమ్ కొనే ముందు ఏమైనా అలెర్జీలు ఉన్నాయేమో చూసుకోవాలి. పెర్ఫ్యూమ్ ఎక్కువగా వాడితే చర్మం దురద పెడుతుంది. ముక్కు, కళ్లు, గొంతు నొప్పి, మతిమరుపు, శ్వాసకోశ వ్యాదులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

 

WP2Social Auto Publish Powered By : XYZScripts.com