
ఇప్పటి వరకు కేంద్రంలోని BJP ప్రభుత్వ తీరును రాష్ట్రంలో ఎండగట్టిన టీఆర్ఎస్ ఇపుడు ఢిల్లీకి మకాం మార్చింది. అక్కడి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో (Parliament Monsoon sessions) కేంద్రం తీరును ఎండగడుతోంది. ఇదే కోవలో నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపు , ధరల పెరుగుదల , ద్రవ్యోల్బణం , ఇతర ప్రజా నమన్యలపై తక్షణమే పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక చర్చకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ TRS ఎంపీలు మరింత దూకుడు పెంచారు. మంగళవారం టీఆర్ఎన్ పార్లమెంటరీ నేత కే.కేశవరావు , టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ఎంపీలు విపక్ష ఎంపీలతో కలసి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు.కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మోదీ డౌన్ డౌన్ .. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని..
ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ నామా నాగేశ్వర్రావు.. ప్రజా సమస్యలను పార్లమెంట్లో చర్చించాలని పట్టుబట్టినందుకు ఎంపీలను సస్పెండ్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. వెంటనే రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని నామా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మొండివైఖరిని నిరశిస్తూ నిరసన తెలుపుతున్న రాజ్యసభ సభ్యులను నస్పెండ్ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నించినందుకు నస్పెండ్ చేస్తారా ?అని ప్రశ్నించారు. అయితే టీఆర్ఎస్, విపక్షాల ఎంపీల ఆందోళన తో లోక్ సభ , రాజ్యసభ 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్.