
- హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసిన అధికారులు
- పనుల వివరాలను సీఎంకు వివరించిన అధికారులు
- కాసేపట్లో ప్రాజెక్ట్ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో సమీక్ష

పోలవరం ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి జగన్ సందర్శించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. కాఫర్ డ్యామ్ పనులు, ఇప్పటి వరకు పూర్తైన పనుల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించిన అనంతరం ప్రాజెక్ట్ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పనులకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ. 12,911 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు.