
మానస ప్రైవేట్ హాస్టల్ లో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.ఖమ్మంలో మెడికో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మమత మెడికల్ కాలేజీలో ఫోర్త్ ఇయర్ చదువుతున్న మానస ప్రైవేట్ హాస్టల్ లో బలవన్మరణానికి పాల్పడింది.
కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. డెంటల్ విద్యార్థిని మానసది వరంగల్ గా గుర్తించారు. మానస మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మమత మెడికల్ కాలేజీ ఖమ్మం నగరంలో ఉంది. మానస ఎంబీబీఎస్ (డెంటల్) ఫోర్త్ ఇయర్ చదువుతోంది. మానస కాలేజీకి చెందిన హాస్టల్ లో కాకుండా.. కాలేజీకి ఎదురుగా ప్రైవేట్ హాస్టల్ లో ఉంటోంది. అక్కడే ఉంటూ కాలేజీకి వెళ్లి చదువుకునేది.
ఆదివారం సాయంత్రం తన రూమ్ లో కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఒక్కసారిగా గదిలోంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన తోటి విద్యార్థులు అక్కడికి పరుగుతీశారు. ఏం జరిగిందోనని ఆరా తీశారు. వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
హాస్టల్ లో ఉండే కొందరు విద్యార్థులు సాహసం చేశారు. మానస దగ్గరికి వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే మానస శరీరం చాలావరకు కాలిపోయింది. తీవ్రమైన కాలిన గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మానస మృతి చెందింది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మానస మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మానస తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
అసలేం జరిగింది? మానస ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉండొచ్చా? అనే కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు.