
చర్ల మండలం పుట్టపాడు వద్ద పోలీసులకు మావోయిస్టులు కనిపించారు. దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ క్రమంలో చర్ల మండలం పుట్టపాడు వద్ద పోలీసులకు మావోయిస్టులు కనిపించారు. దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులు గ్రేహౌండ్స్ బృందంపై కాల్పులు జరిపారు.
ప్రతిగా పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఎల్ఓఎస్ కమాండర్ రాజేశ్, మరొకరు పీఎన్ఎం కమాండర్ నందా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో లభించిన ఎస్ఎల్ఆర్, వస్తు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.